కరీంనగర్ కమిషనరేట్ వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు నిర్వహించిన పోలీసులు



 బుధవారం నాడు సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో పోలీసులు ఆస్ ఆకస్మికంగా వివిధ రకాల తనిఖీలను కొనసాగించారు. పోలీస్ కమిషనర్ విబి కమలాసన్ రెడ్డితో పాటు పలువురు పోలీసు ఉన్నతాధికారులు ఆయా ప్రాంతాల్లో పర్యటించి ప్రత్యక్షంగా పరిస్థితులను పరిశీలించారు.


పోలీస్ కమిషనర్ విబి కమలాసన్ రెడ్డి మంకమ్మ తోట, రాంనగర్, సప్తగిరి కాలనీ, గోదాంగడ్డ, హుస్సైని పుర, ముకరంపుర, మంకమ్మ తోట, కోర్టు చౌరస్తా, మంచిర్యాల చౌరస్తా, నాక చౌరస్తా  దుర్గమ్మ గడ్డ ప్రాంతాల్లో పర్యటించారు


పోలీస్ కమిషనర్ తో పాటు కాన్వాయ్ లా వెంట వచ్చిన వివిధ విభాగాలకు చెందిన పోలీసులు బృందాలుగా ఏర్పడి గల్లీలలో గుమిగూడి ఉన్న జనాన్ని చెదరగొట్టేందుకు లాఠీలు ఝుళిపించారు.



రాత్రి వేళల్లో రోడ్లపై తటస్థపడిన వారి వివరాలు ఆరా తీయడంతో పాటు అత్యవసర పరిస్థితిలో బయటకు వచ్చిన వారి సంబంధించిన పత్రాలు ఆసుపత్రులకు సంబంధించిన చీటీ లను పరిశీలించి వదిలిపెట్టారు


అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వారిని ఐసోలేషన్ వాహనంలో కమిషనరేట్ కేంద్రానికి తరలించి కౌన్సెలింగ్ నిర్వహించారు


 వివిధ ప్రాంతాల్లో జరిగిన తనిఖీలు సందర్భంగా దాదాపు 250 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు


పోలీస్ కమిషనర్ విబి కమలాసన్ రెడ్డి తో పాటుగా అడిషనల్ డిసిపి లు ఎస్ శ్రీనివాస్ (ఎల్ అండ్ ఓ) జి చంద్రమోహన్ (పరిపాలన), టౌన్ డివిజన్ పి అశోక్ లతోపాటు పలువురు పోలీస్ అధికారులు పాల్గొన్నారు

0/Post a Comment/Comments

Previous Post Next Post