భయపడకండి ఆనంద‌య్య మందును ఇంటింటికీ పంపిణీ ....



 నెల్లూరు  జిల్లా కృష్ణపట్నం గ్రామానికి చెందిన ఆనందయ్య త‌యారు చేస్తోన్న క‌రోనా మందు పంపిణీ నిన్న‌ ప్రారంభ‌మైన విష‌యం తెలిసిందే. నిన్న సర్వేపల్లి నియోజకవర్గ ప్రజల్లో కొంద‌రికి అందించారు. ఈ రోజు నెల్లూరు జిల్లా మ‌నుబోలు మండ‌లంలో ఆనంద‌య్య ఔష‌ధం పంపిణీ చేస్తున్నారు. వాలంటీర్లు ఇంటింటికీ తిరుగుతూ ఈ ఔష‌ధాన్ని ఇస్తుండ‌డం గ‌మ‌నార్హం.


కొవిడ్ సోకిన వారికి ఎరుపు రంగు ప్యాకెట్‌ లోని మందు, క‌రోనా రాని వారికి ముందు జాగ్ర‌త్త‌గా నీలం రంగు ప్యాకెట్‌ లోని మందును ఇస్తున్నారు. మ‌రోవైపు, కృష్ణ‌ప‌ట్నం పంచాయ‌తీ ప‌రిధిలో 144 సెక్ష‌న్‌ను తొల‌గించారు. రోజుకి రెండు వేల నుంచి మూడు వేలమందికి ఆనందయ్య మందును పంపిణీ చేయ‌నున్నారు.






0/Post a Comment/Comments

Previous Post Next Post