తెలంగాణలో రేపటి నుంచి లాక్ డౌన్....10 రోజుల పాటు లాక్ డౌన్


 

కరోనా స్వైరవిహారం చేస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో రేపటి నుంచి లాక్ డౌన్ విధించింది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకే కార్యకలాపాలకు అనుమతి నిచ్చింది. ఈ లాక్ డౌన్ 10 రోజుల పాటు కొనసాగనుంది. కోర్టు అడిగిన మేరకు జవాబు ఇచ్చేందుకు సిద్ధమైన తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు లాక్ డౌన్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.


తెలంగాణలో ఇటీవల కొద్దిమేర కరోనా కేసులు, మరణాలు తగ్గినా... ఇతర ప్రాంతాల్లో సెకండ్ వేవ్ ఉద్ధృతిని దృష్టిలో ఉంచుకుని కొన్నిరోజుల పాటు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. కాగా, రంజాన్ (మే 14) తర్వాత లాక్ డౌన్ ప్రకటిస్తారని మొదట వార్తలు వచ్చాయి. కానీ అన్నివైపుల నుంచి ఒత్తిడి పెరగడంతో రేపటి నుంచే లాక్ డౌన్ అమలు చేయాలని నేటి కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు కాసేపట్లో వెలువడనున్నాయి.అటు, ఏపీ తరహాలోనే వ్యాక్సిన్ల కోసం గ్లోబల్ టెండర్లు పిలవాలని కేబినెట్ సమావేశంలో తీర్మానించారు.





0/Post a Comment/Comments

Previous Post Next Post