గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిప్యూటీ తాసిల్దారు కు వినతిపత్రం అందజేత

 


తెలంగాణ రెడ్డి సంఘాల ఐక్య వేదిక కరింనగర్ జిల్లా అధ్యక్షులు వంచ సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం జిల్లా రెడ్డి ఐక్య వేదిక ఆధ్వర్యంలో గన్నేరువరం మండల DPT తహసీల్దార్ ని కలిసి రైతుల పక్షాన  రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. పది రోజులలో వరి కోతలు ప్రారంభమవుతున్న తరుణంలో గతంలో మాదిరిగా గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, మినిమమ్ తేమ శాతం 17 కాకుండా 18 తేమ శాతం వున్న వడ్లను కూడా కొనుగోలు చేయాలని, గన్నీ బ్యాగ్స్ కొరత లేకుండా చూడాలని, రైతు నుండి కొనుగోలు చేసిన వారం లోపే ఆ రైతు అకౌంట్ లో డబ్బులు వేయాలని, లారీ లు గాని ట్రాక్టర్ లు గాని ట్రాన్స్ పోర్ట్ ప్రాబ్లమ్ లేకుండా చూడాలని, ఎండ తీవ్రత తట్టుకోవడానికి రైతులకు ఇబ్బంది లేకుండా వుండడానికి కొనుగోలు కేంద్రాల్లో టెంట్ వేయించి త్రాగు నీటిని ఏర్పాటు చేయాలని, అకాల వర్షాల కారణంగా ధాన్యం తడిసే అవకాశం వున్నది కాబట్టి తాటి పాలిన్ కవర్స్ (పరదలు) అందుబాటులో వుంచాలని ఇలా పలు అంశాలపై డిప్యూటీ తహసీల్దార్ మహేష్ కు వివరించి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఐక్య వేదిక ఉపాధ్యక్షులు కంతాల సత్యనారాయణ రెడ్డి, కరింనగర్ జిల్లా ప్రచార కార్యదర్శి పీచు తిరుపతిరెడ్డి, గన్నేరువరం మండల రెడ్డి బందువులు కంతాల కోండాల్‌ రెడ్డి, సురెందర్‌రెడ్డి, రాంభూపాల్‌ రెడ్డి, రాజిరెడ్డి జాలి శ్రీనువాసరెడ్డి, నరేష్ రెడ్డి రైతు బందువులు  రాజిరెడ్డి, రాపోలు రాయమల్లు మరియు మండల రైతు బందువులు పాల్గొన్నారు

0/Post a Comment/Comments

Previous Post Next Post