అయోధ్యలో నిర్మించబోయే రాం మందిర్ నిర్మాణంలో భాగంగా ప్రజల నుండి సేకరించే నిదికి సంబంధించి రసీదు తప్పకుండా ఇవ్వాలని తిమ్మాపూర్ ఖండ సంచలన సంయోజక్ సాయిని మల్లేశం తెలిపారు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ ఖండ పరిధిలోని తిమ్మాపూర్, చిగురుమామిడి, గన్నేరువరం మండలాలకు సంబందించి అన్నీ గ్రామాల సంయోజక్ సమితి కార్యకర్తలతో ఆదివారం ముఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా హాజరైన సాయిని మల్లేశం పలు సూచనలు చేసారు. గ్రామాల్లో అందరి ఇండ్లల్లోకి వెళ్లి రాం మందిర్ నిర్మాణం ప్రాషష్ట్యాన్ని వివరించాలని తెలిపారు.మందిర నిర్మాణంలో ప్రజల భాగస్వామ్య ఆవష్యకతను కూడా వివరించాలని కోరారు. నిధి సమర్పించే వారికి తప్పనిసరిగా రసీదు,కరపత్రం, వారి ఇంటికి రాముని స్టిక్కర్ అందివ్వాలని తెలిపారు.సేకరించిన నిధి వివరాలను సంబంధిత భాద్యులకు రోజువారీగా వివరాలు తెలపాలని సూచించారు.10 వేల రూ. నిధి సమర్పకుల ఎవరైనా ఉంటే వారికి ప్రత్యేక రసీదు ఇవ్వాలని సూచించారు.ఎక్కువ మొత్తంలో నిధి సమర్పించే వారెవరైనా గ్రామాల భాద్యులు కాకుండా జిల్లాకు సంబందించిన వారు వస్తారని ఆ విషయం తెలపాలని సూచించారు. రికార్డ్ ల నిర్వహించడం జాగ్రత్తగా జరగాలని కోరారు. గ్రామాల్లోని అందరినీ కలుపుకోవాలని ఇది భగవంతుని కార్యక్రమం లాగా భావించి ప్రజలు కూడా శక్తివంచన లేకుండా సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో వివిధ మండలాలకు చెందిన సంయోజక్ లు, ప్రభారీలు, వివిధ క్షేత్రాలకు చెందిన వారు పాల్గొన్నారు.
Post a Comment