పెళ్లి కోసమే మతం మారడం సరికాదు: అలహాబాద్ హైకోర్టు




 మతాంతర వివాహం చేసుకున్న తమకు కుటుంబ సభ్యుల నుంచి హాని ఉందని, రక్షణ కల్పించాలంటూ ఓ జంట దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను తోసిపుచ్చిన అలాహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పెళ్లి కోసమే మతం మార్చుకోవడం ఆమోదనీయం కాదని స్పష్టం చేసింది. ముస్లిం అయిన యువతి నెల రోజుల క్రితమే హిందూ మతం తీసుకోవడాన్ని ప్రస్తావిస్తూ ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. పెళ్లి చేసుకునేందుకే మతం మారినట్టు స్పష్టంగా అర్థమవుతోందన్న న్యాయమూర్తి జస్టిస్ మహేశ్‌చంద్ర త్రిపాఠీ.. 2014లో ఇదే కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా గుర్తు చేశారు.అప్పట్లో ఓ యువతి ఇస్లాంలోకి మారి ముస్లిం యువకుడిని పెళ్లి చేసుకుంది. న్యాయమూర్తి ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. పెళ్లి చేసుకోవడం కోసమే మతం మారడం సరైంది కాదని పేర్కొన్నారు. ఆయా మత విశ్వాసాలు, సంప్రదాయల గురించి ఎటువంటి అవగాహన లేకుండా కేవలం పెళ్లి చేసుకునే ఉద్దేశంతోనే మతాలను స్వీకరించడం ఆమోదనీయం కాదని స్పష్టం చేశారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post