చిగురుమామిడి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం పాల్గొన్న ఎమ్మెల్యే సతీష్ కుమార్



కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం, మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశానికి హాజరైన ఓడితల సతీష్ కుమార్, ఎంపీపీ కొత్త వినీత శ్రీనివాస్ రెడ్డి, జడ్పిటిసి గీకురు రవీందర్, బేతి రాజిరెడ్డి, సహకార సంఘం చైర్మన్ వెంకట రమణ రెడ్డి, ఎమ్మార్వో జాహిద్ పాషా, ఎంపీడీవో కాజా మోహినుద్దీన్, వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు, పాల్గొన్నారు
ఎమ్మెల్యే ఒడితలసతీష్ కుమార్ మాట్లాడుతూ కరోనా covid 19 వలన పదవ తరగతి పరీక్షలు వాయిదా పడినందున వలన 10వ తరగతి విద్యార్థులను ఉత్తీర్ణత చేయించి పై తరగతులకు పంపినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు ఎమ్మెల్యే, ప్రజా ప్రతినిధులు అధికారులు. కరోనా మహమ్మారి దరిచేరకుండా ఉండాలంటే గ్రామాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఇంటి ఆవరణలో చెత్త లేకుండా చూసుకోవాలని ఆయన అన్నారు. మహిళా భవనాలు, గ్రామ పంచాయతీలు, కుల సంఘ భవనాలు తొందరగా నిర్మించుకోవాలని, ఆరు నెలల వరకు ప్రారంభోత్సవం చేసుకునే విధంగా చూడాలని గ్రామ ప్రజాప్రతినిధులకు తెలిపారు.

వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు మాట్లాడుతూ మిషన్ భగీరథ పైప్ లైన్లు వేసి కొన్ని చోట్ల రోడ్లు విపరీతంగా చెడిపోయినవని , మరికొన్ని చోట్ల పైప్ లైన్లు వేయలేదని, సర్పంచ్ , ఎంపిటిసిలు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాలలో బెల్టుషాపులు విపరీతంగా ఉన్న ఎక్సైజ్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని, సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యేకు విన్నవించుకున్నారు. ఎమ్మెల్యే వెంటనే స్పందించి గ్రామాలలో బెల్ట్ షాపులు అసలు ఉండకూడదని, అటువంటి వారి మీద కేసులు పెట్టాలని ఎక్సైజ్ ఎస్ ఐ శశిధర్ కు ఎమ్మెల్యే సతీష్ కుమార్ తెలిపారు
Previous Post Next Post