ఆంధ్రా లో వలస కూలీలపై విరిగిన లాఠీ!



గుంటూరు జిల్లా తాడేపల్లిలో వలస కూలీలపై పోలీసులు ఈ ఉదయం లాఠీ చార్జీతో విరుచుకుపడ్డారు. దీంతో కూలీలు భయంతో రోడ్లపై పరుగులు పెట్టారు. అనంతరం వారందరినీ పునరావాస కేంద్రాలకు తరలించారు. ఉత్తరప్రదేశ్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఝార్ఖండ్,  శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన వలస కూలీలు కొందరు నిన్న సాయంత్రం రోడ్డుపై నడుచుకుంటూ స్వస్థలాలకు పయనం కాగా, అదే సమయంలో అటువైపుగా వెళ్తున్న ఏపీ సీఎస్ నీలం సాహ్ని వారిని చూసి ఆగి వివరాలు తెలుసుకున్నారు. తొలుత వారిని పునరావాస కేంద్రాలకు తరలించాలని, అక్కడి నుంచి స్వస్థలాలకు పంపాలని ఆదేశించారు. సీఎస్ ఆదేశాలతో వలస కూలీలందరినీ అధికారులు తాడేపల్లిలోని విజయవాడ క్లబ్‌కు తరలించారు. ఈ ఉదయం వారందరికీ అల్పాహారం పంపిణీ చేశారు. ఈ క్రమంలో సైకిళ్లపై వచ్చిన దాదాపు 150 మంది కూలీలు టిఫిన్ చేసి తిరుగుముఖం పట్టారు. వీరంతా విజయవాడ కనకదుర్గమ్మ వారధి వద్దకు చేరుకోగానే పోలీసులు చూసి అడ్డుకుని లాఠీచార్జ్ చేశారు. దీంతో కూలీలు భయంతో రోడ్లపై పరుగులు తీశారు. అనంతరం వారిందరినీ పట్టుకుని తిరిగి విజయవాడ క్లబ్‌కు తరలించారు. 

0/Post a Comment/Comments

Previous Post Next Post