కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రానికి చెందిన పరాంకుశం ప్రదీప్ కీర్తన దంపతులు ద్విచక్రవాహనంపై కరీంనగర్ నుండి తిమ్మాపూర్ వెళ్తుండగా ఆదివారం రాత్రి అలుగునూర్ కాకతీయ కాలువ లో ప్రమాదవశాత్తు పడ్డారు భార్య కీర్తన మృతి చెందగా భర్త ప్రదీప్ కు తీవ్ర గాయాలు కావడంతో తిమ్మాపూర్ పోలీసులు ఆస్పత్రిలో చేర్పించారు సోమవారం కరీంనగర్ పట్టణం లోని అపోలో రీచ్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న ప్రదీప్ ను మానకొండూరు శాసనసభ్యులు రసమయి బాలకిషన్ , సుడా చైర్మన్ జీవి రామకృష్ణ మరియు గన్నేరువరం మాజీ సర్పంచ్ జువ్వాడి మన్మోహన్ రావు తో కలిసి పరామర్శించి ప్రదీప్ కు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు సోమవారం ఉదయం మానకొండూరు శాసనసభ్యులు రసమయి బాలకిషన్ మరియు నాయకులతో కలిసి సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు.
Post a Comment