.తాను సీఎం అవుతానంటూ వస్తున్న వార్తలన్నీ ఊహాగానాలేనని మంత్రి కేటీఆర్ వెల్లడి

టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో పట్టణాల అభివృద్ధి జరుగుతోందని కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలో నిరంతర విద్యుత్‌ వెలుగులు తీసుకొచ్చింది తమ ప్రభుత్వమేనని చెప్పారు. రాష్ట్రంలో 90 మినీ ట్యాంక్‌ బండ్‌లు నిర్మించామని వెల్లడించారు. హైదరాబాద్‌ చుట్టూ 25 పార్కులు ఏర్పాటు చేశామని చెప్పారు. రూ.8 వేల కోట్లతో 2 లక్షల ఇళ్ల నిర్మాణం జరుగుతోందన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ ఐదేళ్లలో కేంద్రం నుంచి అదనపు నిధులు ఏమైనా తీసుకొచ్చారా? అని కేటీఆర్ ప్రశ్నించారు.

రాష్ట్ర విభజన జరిగాక తెలంగాణలో కొత్తగా 33 జిల్లాలు ఏర్పాటు చేశామని కేటీఆర్ గుర్తు చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలో రాష్ట్రంలో పెద్దగా వ్యతిరేకత రాలేదని ఆయన చెప్పుకొచ్చారు. పరోక్షంగా ఏపీలో జరుగుతున్న ఆందోళనల గురించి ప్రస్తావించారు. తమది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమని.. ఉద్యోగులకు ప్రభుత్వంపై విశ్వాసం ఉందని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
రాష్ట్ర విభజన జరిగాక తెలంగాణలో కొత్తగా 33 జిల్లాలు ఏర్పాటు చేశామని కేటీఆర్ గుర్తు చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలో రాష్ట్రంలో పెద్దగా వ్యతిరేకత రాలేదని ఆయన చెప్పుకొచ్చారు. పరోక్షంగా ఏపీలో జరుగుతున్న ఆందోళనల గురించి ప్రస్తావించారు. తమది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమని.. ఉద్యోగులకు ప్రభుత్వంపై విశ్వాసం ఉందని కేటీఆర్ వ్యాఖ్యానించారు.తాను సీఎం అవుతానంటూ వస్తున్న వార్తలన్నీ ఊహాగానాలేనని మంత్రి కేటీఆర్ తేల్చి చెప్పారు. మీడియాలోనే ఈ ప్రచారం జరుగుతోందని.. మంత్రులతోనూ మీడియా వాళ్లే మాట్లాడిస్తున్నారని వ్యాఖ్యానించారు. మున్సిపల్ శాఖ మంత్రిగా ఈ ఎన్నికలు తనకు సవాలు లాంటివని చెప్పారు. కొత్త మున్సిపల్‌ చట్టాన్ని కఠినంగా అమలు చేస్తామని వెల్లడించారు.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )
credit: third party image reference

0/Post a Comment/Comments

Previous Post Next Post