నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చరల్ అండ్ రూరల్ డెవలప్ మెంట్లో 154 ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ వెలువడింది . జనవరి 10 నుంచి ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అవుతుంది . జనవరి 31 వరకూ దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది .
దీని ప్రధాన కేంద్రం ముంబయి . అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది . పోస్టుల వారీగా విద్యార్హతలు నిర్ణయించారు . సరైన అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది . జనవరి 10 న పూర్తి ఉద్యోగ ప్రకటన వెలువడుతుంది .:. అసిస్టెంట్ మేనేజర్ ( గ్రేడ్ – ఎ ) – ఖాళీల సంఖ్య : 154, మళ్లీ వీటిలో రూరల్ డెవలప్‌మెంట్ బ్యాంకింగ్ సర్వీస్ కోసం 139 పోస్టులు , రాజ్‌భాష సర్వీస్ కోసం 8 పోస్టులు , లీగల్ సర్వీస్ కోసం 3 పోస్టులు , ప్రోటోకాల్ , సెక్యూరిటీ సర్వీస్ కోసం 4 పోస్టులు ఉన్నాయి . అంటే మొత్తం 154 పోస్టులన్నమాట .
ఆన్‌లైన్ ద్వారా ద్వారా ధరఖాస్తు చేసుకోవాల్సిఉంటుంది . ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ 10.01.2020 న ప్రారంభమై .. 31.01.2020 న ముగుస్తుంది . మరిన్ని వివరాల కోసం
www.nabard.org అనే వెబ్ సైట్ ను చూడవచ్చు .
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )
credit: third party image reference
Post a Comment