టీడీఎల్పీ సమావేశానికి ఐదుగురు ఎమ్మెల్యేలు గైర్హాజరు

 అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. తప్పనిసరిగా సభకు హాజరుకావాలని సభ్యులకు విప్‌ జారీ చేశారు. అయితే టీడీఎల్పీ సమావేశానికి ఐదుగురు ఎమ్మెల్యేలు గైర్హాజరైనారు. ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసులు, వాసుపల్లి గణేష్, అశోక్, అనగాని సత్యప్రసాద్, ఆదిరెడ్డి భవాని సమావేశానికి రాలేదు. వ్యక్తిగత కారణాలతో మీటింగ్‌కు రాలేకపోతున్నామని నేతలు చెబుతున్నారు. విజయవాడ గొల్లపూడిలో ఉంటున్న మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, విద్యాధరపురంలో నివాసం ఉంటున్న సీనియర్‌ నాయకుడు వర్ల రామయ్య, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నకు నోటీసు ఇచ్చారు. వారి ఇంటికి ఈ నోటీసులు అంటించారు. పోలీసుల నోటీసులపై కూడా టీడీఎల్పీలో చర్చించే అవకాశం ఉందని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి.
అయితే సోమవారం అసెంబ్లీకి ఎమ్మెల్యేలు వస్తారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. రాజధాని తరలింపు ప్రక్రియను అడ్డుకునే అవకాశాలపై టీడీపీ వ్యూహ రచన చేస్తోంది. సీఆర్డీఏపై మనీ బిల్లు పెడితే ఏం చేయాలనే అంశంపైనా నేతలు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా మండలిలో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలు చర్చిస్తున్నట్లు సమాచారం. దీంతో పాటుగా 20న అసెంబ్లీ ముట్టడికి అమరావతి జేఏసీ పిలుపునివ్వడంపైనా చర్చించే అవకాశం ఉందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. 20 తేదీన తలపెట్టిన ‘అసెంబ్లీ ముట్టడి’ని అడ్డుకునేందుకు పోలీసుశాఖ పకడ్బందీ చర్యలు చేపట్టింది. ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ నేతలు ఎవరూ ఇళ్లలో నుంచి బయటకు రాకుండా వారికి ముందుగానే నోటీసులు ఇచ్చే కార్యక్రమానికి పోలీసులు శ్రీకారం చుట్టారు. 
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )
credit: third party image reference

0/Post a Comment/Comments

Previous Post Next Post