ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా పల్స్‌పోలియో కార్యక్రమం

చిన్నారుల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా పోలియో రహిత తెలంగాణగా మార్చేందుకు ఏటా నిర్వహిస్తున్న పల్స్‌పోలియో కార్యక్రమాన్ని ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్నారు. 
అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి ఐదేండ్లలోపు పిల్లలందరికీ చుక్కల మందు వేసేందుకు ఆరోగ్యశాఖ ఏర్పాట్లుచేసింది. తెలంగాణవ్యాప్తంగా 38,36,505 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని నిర్ణయించారు.
ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా ఆయా జిల్లాలకు 50,64,500 వాక్సిన్‌ డోస్‌లు సరఫరాచేశారు. రాష్ట్రవ్యాప్తంగా 23,331 చుక్కల పంపిణీ కేంద్రాల్లో, అదేవిధంగా అన్ని దవాఖానలు, బస్టాండ్లు, మెట్రోస్టేషన్లు, రైల్వే స్టేషన్లలోనూ చుక్కల మందు వేయనున్నారు. ఆదివారం చుక్కలు వేయించుకోని పిల్లలకు 20, 21 తేదీల్లో ఇంటింటికీ వెళ్లి వేస్తారు. ఇందుకోసం 46,432 బృందాలు పనిచేయనున్నాయి. పల్స్‌పోలియో కార్యక్రమ నిర్వహణలో 2,320 మంది రూట్‌ సూపర్‌వైజర్లు, 7,141 మంది ఏఎన్‌ఎంలు, 26,277 మంది ఆశావర్కర్లు, 35,353 అంగన్‌వాడీ వర్కర్లు, ఇతర సిబ్బంది పాల్గొననున్నారు.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )
credit: third party image reference

0/Post a Comment/Comments

Previous Post Next Post