అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన కు భారీ సంఖ్యలో వీక్షకులు , విద్యార్థులు మరియు పలువురునిపుణులు

నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో కొనసాగుతున్న అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన కు భారీ సంఖ్యలో వీక్షలులు , విద్యార్థులు  మరియు పలువురు  విచ్చేస్తున్నారు  . గత మూడు రోజులుగా అంతంత మాత్రంగా వచ్చిన సందర్శకులు శనివారం దాదాపు పది వేల వరకు సందర్శించారు. ఎగ్జిబిషన్‌ ప్రారంభమై నాలుగు రోజులు కావడంతో దాదాపు స్టాల్‌లు ప్రారంభం కాగా, మిగిలిన స్టాల్స్‌ నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఇవే కాకుండా ప్రభుత్వ స్టాళ్ల నిర్మాణ పనులను పూర్తి చేసి ప్రారంభించేందుకు ఆయా శాఖల అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర జైళ్ల శాఖ స్టాల్‌ను సోమవారం ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )
credit: third party image reference

Post a Comment

Previous Post Next Post