గాయంతో బాధపడుతున్న సుశీల్‌కుమార్ 74 కిలోల ఫ్రీ స్టైల్ విభాగంలో నిర్వహించే ట్రయల్స్‌ను వాయిదా వేయాలని డబ్ల్యుఎఫ్‌ఐ కోరాడు. అయితే ట్రయల్స్‌ను వాయిదా వేయడం ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదని డబ్ల్యుఎఫ్‌ఐ తేల్చిచెప్పింది. ట్రయల్స్‌లోని విజేతలు ఈనెలలో రోమ్ వేదికగా జరగనున్న ఫస్ట్ ర్యాంకింగ్ సిరీస్ టోర్నీకి, ఫిబ్రవరిలో ఢిల్లీ వేదికగా జరగనున్న ఆసియా ఛాంపియన్‌షిప్‌కు, మార్చిలో చైనాలో జరగనున్న ఆసియా ఒలింపిక్స్ క్వాలిఫయర్స్‌కు అర్హత సాధిస్తారు. . రెండు వారాల్లో ఫిట్‌నెస్ సాధించి పునరాగమనం చేస్తానని సుశీల్ కుమార్ ధీమా వ్యక్తం చేశాడు. సుశీల్ కుమార్ ఒలింపిక్స్‌లో 2008లో కాంస్యం, 2012 రజత పతకం గెల్చిన సంగతి తెలిసిందే.
credit: third party image reference
Post a Comment