సౌత్‌జోన్ స్విమ్మింగ్ చాంపియన్‌షి్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ స్విమ్మర్లు సత్తాచాటారు. మూడ్రోజులుగా గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో జరుగుతున్న ఈ పోటీలు ఆదివారం ముగిశాయి. ఓవరాల్‌గా తెలంగాణ అన్ని విభాగాల్లో కలిపి 49 పతకాలు కొల్లగొట్టింది. వీటిలో పది బంగారు పతకాలున్నాయి. ఆంధ్రప్రదేశ్ స్విమ్మర్లు మొత్తంగా 17 మెడల్స్ సొంతం చేసుకున్నారు. చివరి రోజు పోటీల్లో తెలంగాణ నుంచి జాహ్నవి గోలి అత్యధికంగా ఆరు పతకాలు నెగ్గగా ఆంధ్రప్రదేశ్ నుంచి తీర్ధూ సామదేవ్ ఐదు పతకాలు గెలుపొందాడు.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )
credit: third party image reference
Post a Comment