దిశ కేసులో నిందితుల ఎన్ కౌంటర్ - సీపీ సజ్జనార్ పాత్రధారి కావచ్చు : మందకృష్ణ మాదిగ

దిశ అత్యాచార ఘటనలో నిందితులది ఎన్ కౌంటర్ కాదు సామూహిక హత్యాకాండ అని ఆరోపించిన ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ, సీపీ సజ్జనార్ పై విమర్శలు చేశారు. యాదాద్రి భువనగిరిలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమవేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ ఘటనలో పోలీస్ కమిషనర్ సజ్జనార్ పేరు కేంద్ర బిందువుగా మారిందని, ‘సజ్జనార్ పాత్రధారి కావచ్చు.. సూత్రధారి కాదుగా. సూత్రధారుల ఆలోచనకు అనుగుణంగా పాత్ర పోషించినోడు సజ్జనార్ కావచ్చు. ఆయన ఒక్కడే తీసుకున్న నిర్ణయమైతే కాదు.. ఆయనకు అవసరం కూడా లేదు’ అని  అన్నారు. ఉన్నతవర్గాలకు ప్రమాదమొస్తే అది దేశానికొచ్చిన ప్రమాదంగా భావిస్తూ మీడియా చిత్రీకరిస్తుందని, ప్రపంచానికి వచ్చిన ప్రమాదంగా రాజకీయపార్టీలు గొంతెత్తి అరుస్తున్నాయని విమర్శించారు. ఆ ప్రమాదాన్ని నివారించడానికి ప్రభుత్వాలు కొత్త చట్టాలు తీసుకొస్తున్నాయంటూ విమర్శించారు. అదే, అణగారిన వర్గాల మహిళలపై ఘాతుకాలు జరిగితే మీడియా మౌనంగా వుంటుందని, రాజకీయ పార్టీల నేతల నోర్లు మూసుకుపోతాయని, అప్పుడు మాత్రం కొత్తచట్టాలు తీసుకురారని విమర్శించారు.

దిశ అత్యాచారం, హత్య – నిందితుల ఎన్‌కౌంటర్ ఏది కరెక్ట్ !!! ???

0/Post a Comment/Comments

Previous Post Next Post